బీజేపీలో చేరనున్న సత్య గోపినాథ్ దాస్


రాజమహేంద్రవరం ఇస్కాన్ శ్రీ సత్య గోపీనాథ్ దాస్ స్వామీజీ రేపు (14 వ తేదీ బుధవారం) బీజేపీలో చేరుతున్నారు! రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తదితర బిజెపి ప్రముఖులు ఈ సందర్భంగా రాజమండ్రి వస్తున్నారు. స్థానిక ఐఎల్ టిడి జంక్షన్ గేదెల నూకరాజు కల్యాణ మండపంలో జరిగే బిజెపి సభలో గోపినాథ్ దాస్ స్వామీజీ బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు. ఇస్కాన్ ఆధ్యాత్మిక గురువుగా.. వివిధ సాంస్కృతిక, సేవా కార్యక్రమా నిర్వాహకునిగా, ప్రవచనకర్తగా సత్య గోపినాథ్ దాస్ స్వామీజీకి మంచి పేరుంది.

ముఖ్యాంశాలు