అదుపు తప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం


Turkey Flight accident

టర్కీ రాజధాని అంకారాలో 162 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం రన్‌వే నుంచి జారి సముద్రం వైపు దూసుకెళ్లింది. ఆదివారం టర్కీలోని ట్రాబ్జాన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన బోయింగ్‌ 737-800 విమానం రన్‌వేపై మంచు ఎక్కువగా ఉండడంతో అదుపు తప్పి రన్‌వేకు సమీపంలోని నల్ల సముద్రం వైపు దూసుకెళ్లింది. అయితే విమానం పూర్తిగా సముద్రంలోకి జారిపోకుండా కొండ అంచున మట్టిలో ఇరుక్కుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు విమానంలోని మహిళల్ని, పిల్లల్నిఇతర ప్రయాణికుల్ని జాగ్రత్తగా బయటికి రప్పించి ఆ తరువాత విమానాన్ని మరమ్మతులు చేశారు. విమానం సముద్రం వద్దకు జారిపోయిన తర్వాత పెద్దఎత్తున పొగలు రావడంతో ఫైర్ ఇంజిన్లు రప్పించి వాటిని అదుపు చేసారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

ముఖ్యాంశాలు