సొంతూళ్లో చంద్రబాబు


తన స్వగ్రామం నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్థులను అయన ఎంతో ప్రేమాప్యాయతలతో పలకరించారు. వరసకు సోదరుడైన మురళీ నాయుడు గత వారం మృతిచెందడంతో ఆయన కుటుంబ సభ్యుల్ని బాబు పరామర్శించారు. గ్రామస్థులు ఎవరు ఎదురొచ్చినా కుశల ప్రశ్నలు వేస్తూ పలకరించారు. చిన్ననాటి స్నేహితులతో కాసేపు ముచ్చటించారు. కొంతమంది సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు తీసుకురాగా వాటిని స్వీకరించారు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా తమ కుటుంబానికి వెంటనే చెప్పాలని ఆయన గ్రామస్తులను కోరారు.

ముఖ్యాంశాలు