పురాతన చర్చిని పేల్చేసిన చైనా


చైనాలోని ఎవాంజలికల్ చర్చిని చైనా ప్రభుత్వం డైనమైట్‌ లతో పేల్చి నేలకూల్చింది. ఈ ఘటనపై క్రైస్తవ సంఘాలు చైనా ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మత స్వేచ్ఛ, మానవ హక్కులపై చైనా ప్రభుత్వానికి గౌరవం లేదని అవి ధ్వజమెత్తాయి. షాంగ్జీ ప్రావిన్సులో గల ది గోల్డెన్‌ ల్యాంప్‌స్టాండ్‌ చర్చిని అత్యంత పురాతనమైనదిగా భావిస్తారు. కొత్త కాలంగా ప్రజల అధ్యాత్మిక జీవనాన్ని అదుపాజ్ఞల్లో పెట్టుకునేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూంది. ఇందులో భాగంగా పలు చర్చిలను నేలకూల్చు తోంది. పాశ్చాత్య మత సంస్కృతికి చెందిన క్రైస్తవం దేశంలో వ్యాపిస్తే కమ్యూనిస్టు పార్టీ పాలనా, మనుగడ ప్రశ్నార్థకం అవుతాయనేది చైనా ప్రభుత్వ భయంగా పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే ఏసుక్రీస్తు ఫోటోలు తీసేసి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఫోటోలను పెట్టించే కార్యక్రమాన్ని కూడా చైనా ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నది. అధ్యాత్మికతపై నియంత్రణ పేరుతో ప్రత్యేకంగా క్రైస్తవ మతాన్నిదేశం నుంచి పెకలించేందుకు చైనా ప్రభుత్వం యత్నిస్తోందని పలువురు క్రైస్తవులు మండిపడుతున్నారు.

ముఖ్యాంశాలు