జోడెద్దుల బండిపై బాలయ్య


సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వియ్యంకుడి గ్రామం నారావారిపల్లి వచ్చిన నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం సాయంత్రం జోడెద్దుల బండిపై ఊర్లో షికారు చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. చర్నాకోల పట్టుకుని కోడెగిత్తలను పరుగెత్తించా రు. ఆదివారం తెల్లారుజామున భోగిమంటలు వేసుకున్న గ్రామస్థులతో ఆయన మాట్లాడారు. అనంతరం తిరుపతిలోని గ్రూప్‌ థియేటర్‌లో జైసింహా చిత్రాన్ని వీక్షించారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. త్వరలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ షూటింగ్ మొదలవు తుందన్నారు. బాలకృష్ణ వెంట తితిదే పాలకమండలి మాజీ ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి కూడా ఉన్నారు.

ముఖ్యాంశాలు