థియేటర్ గేట్ దూకిన హీరో సూర్య


తమిళ హీరో సూర్య సోమవారం రాజమహేంద్రవరం వచ్చారు. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘గ్యాంగ్‌’. స్థానిక మేనకా థియేటర్ లో ఆడుతోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీత దర్శకుడు కాగా కీర్తిసురేశ్‌ కథానాయిక. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, కార్తిక్‌ ప్రధాన పాత్రధారులు. విజయయాత్రలో భాగంగా సూర్య సోమవారం మేనకా థియేటర్లో సందడి చేశారు. ఆయన్ని చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో చేరారు. వారికి సూర్య అభివాదాలు చేసారు. థియేటర్లో కార్యక్రమం పూర్తైన తర్వాత ప్రధాన ద్వారం నుంచి ఆయన బయటికి రావాల్సి ఉంది. అయితే అభిమానులు చాలా ఎక్కువ మంది ఉండటంతో ఆయన అనూహ్యంగా థియేటర్ వెనుక ఉన్నగేటు గుండా దుమికి బయటికి వెళ్లారు. ఆయన ఇటువైపు వెళ్లే ఆలోచనే లేని థియేటర్‌ యాజమాన్యం ఈ గేట్ కి తాళం వేసింది. దీంతో సూర్య గేటు దూకారన్నమాట. ఆయన చాలా మామూలుగా చేసిన ఈ పని అభిమానులను, థియేటర్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమధ్య కొందరు అభిమానులు తనకు పాదాభివందనం చేయడంతో సూర్య తానూ అభిమానుల కాళ్లకు దణ్ణం పెట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం