కూలిన ఇండోనేషియా స్టాక్‌ ఎక్స్ఛేంజీ‌ భవనం


ఇండోనేషియాలో రాజధాని జకార్తాలోని ఇండోనేషియా స్టాక్‌ ఎక్స్ఛేంజీ‌ భవనంలోని ఓ అంతస్తు సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు, సహాయకసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. భవనంలోని ఓ అంతస్తులో పైకప్పు ఉన్నట్టుండి కుప్పకూలింది. ఊహించని ప్రమాదం కావడంతో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. పలువురు భవనం బయటకు హాహాకారాలతో పరుగులు తీశారు. ఘటనకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ముఖ్యాంశాలు