జయేంద్ర సరస్వతికి అస్వస్థత


కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి ఆదివారం రాత్రి అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆయనను మఠం నిర్వాహకులు వెంటనే చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఏడుగంటల సమయంలో మఠంలో ఉన్న స్వామి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి లోనవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం