అట్టహాసంగా కేన్స్‌ సినీ వేడుక ప్రారంభం


72వ అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవ వేడుక ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రం (ఫ్రాన్స్‌ కాలమానం ప్రకారం) వేడుకను ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ సినిమా ప్రీమియర్‌ షోతో ప్రారంభించారు. తొలి రోజు ప్రముఖ పాప్‌ గాయని సెలీనా గోమేజ్‌ హాజరై రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. ఆమెతో పాటు ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ చిత్రంలోని నటీనటులు హాజరయ్యారు. మే 25 వరకు ఈ వేడుక జరుగుతుంది. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్‌లో ఈ వేడుక జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తీసిన ఉత్తమ చిత్రాలన్నీ ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. ఈ ఏడాది కేన్స్‌కు భారత్‌ నుంచి ఒక్క సినిమా కూడా ఎంపిక కాలేదు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం