కమల్‌ హాసన్‌పై కేసు నమోదు

సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎమ్‌ఎన్‌ఎమ్‌) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌పై పోలీసులు మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తమిళనాడులో అరవకురిచ్చిలో ఈనెల 12న ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్  "స్వాతంత్య్ర భారత్‌లో తొలి తీవ్రవాది ఒక హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’’ అని వ్యాఖ్యానించారు. దీంతో  ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేసినట్లు కరూర్‌ జిల్లా పోలీసులు తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో, దేశంలో పలు చోట్ల హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.

Facebook
Twitter