పుట్టపర్తికి ప్రత్యేక రైళ్లు


పుట్టపర్తి సత్యసాయి జయంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈనెల 21- 23 తేదీల్లో బాబా జయంత్యుత్సవాలు జరుగుతాయి. దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి తరలివస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈనెల 15 నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. వివిధ నగరాల నుంచి పుట్టపర్తికి ప్రత్యేక రైళ్లు తిరుగుతాయి. నాందేడ్- బెంగళూరు(16593), గోరక్‌పూర్- యశ్వంతపూర్ (12591), అజ్మీర్ కేఎస్‌ఆర్ - బెంగళూరు (16531), అహ్మదాబాద్- యశ్వంతపూర్ (16501), న్యూఢిల్లీ- కొయంబత్తూరు(12648), భగత్ కీ కొత్తి- కేఎస్‌ఆర్ బెంగళూరు(16533), బెంగళూరు- నాందేడ్ (16594), యశ్వంతపూర్- కాచిగూడ (16569), యశ్వంతపూర్- లక్నో (22683), యశ్వంతపూర్- కోర్బా(1251), యశ్వంతపూర్- గోరక్‌పూర్ (15024) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతారు. భక్తులు రిజర్వేషన్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఉమాశంకర్ తెలిపారు.

హైదరాబాద్- కొల్లాం మధ్య సువిధ రైళ్లు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్- కొల్లాం మధ్య సువిధ ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. రైలు నెంబర్ 82721 ఈ నెల 17, 21, 25, 29 తేదీల్లో హైదరాబాద్ నుంచి కొల్లాంకు చేరుకుంటుంది. తిరిగి 82722 నెంబరుతో 19, 23,27, డిసెంబర్ 1న కొల్లాం నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. కాకినాడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు డిసెంబర్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కాకినాడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది. 07210 రైలు కాకినాడ టౌన్ నుంచి తిరుపతికి సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 6.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07209 రైలు తిరుపతిలో సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.

ముఖ్యాంశాలు