కోనసీమ విద్యార్థికి రేడియో సాయి ప్రశంస


రేడియో సాయి తెలుగు ప్రసారాలవిభాగం ఏడవ వార్షికోత్సవం సందర్భంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన సంగీత సమ్మేళనంలో అమలాపురం విద్యార్థి కూచి శ్రీ సాయి లోహిత్ అపురూప్ ప్రతిభను ప్రదర్శించి ప్రశంసాపత్రం అందుకున్నాడు. వీణావాదనంలో అతడు చక్కని ప్రతిభ చూపి రసజ్ఞుల ప్రశంసలు అందుకున్నాడు. ఆగస్టు లో ప్రశాంతి నిలయంలో జరిగిన సంగీత సమ్మేళనం ప్రత్యక్ష ప్రసారంలో అపురూప్ వీణపై వినసొంపైన సాయి భక్తి స్వరాలు పలికించాడు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ రేడియో సాయి డివిజన్ ప్రతినిధులు ఈ సందర్భంగా అతడికి ప్రశంసాపాత్రం, జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు. వీణావాదనంలో జిల్లా నుంచి ఎంపికై ప్రశాంతి నిలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఏకైక విద్యార్థి అపురూప్ కావడం విశేషం.

ముఖ్యాంశాలు