బాలయ్య బలానికి విస్తుపోయిన మహీంద్రా


నందమూరి బాలకృష్ణ ‘జై సింహా’ సినిమాలో ప్రదర్శించిన భుజబలానికి సాక్షాత్తు మహీంద్రా బొలెరో కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా విస్తుపోయారు! ఈ సినిమాలో బాలకృష్ణ బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే సన్నివేశం ఒకటి ఉంది. ఈ వీడియోను విష్ణు చైతన్య అనే ఒక నెటిజన్‌ ఆనంద్‌ మహీంద్రాకు ట్విటర్‌లో పంపించారు. ‘మహీంద్ర సర్‌..బాలకృష్ణ బొలెరో కారు ఎత్తుతున్న ఈ సన్నివేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఈ సీన్‌ చూడాలి’ అని ఆ నెటిజెన్ ట్వీట్ చేసారు. దీన్నిచూసి మహీంద్ర ట్విటర్‌లో స్పందిస్తూ..‘హాహా..బొలెరో కార్లను చెక్‌ చేయడానికి ఇకపై సర్వీస్‌ వర్క్‌షాపులు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌లు వాడనక్కర్లేదు’ అని ట్వీటారు! కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జై సింహా’ లో బాలయ్యకి జోడీగా నయనతార, నటాషా దోషి, హరిప్రియ నటించారు. ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్ అందుకుంది.

ముఖ్యాంశాలు