రామ్ దేవ్ సంచలనం.. ఇక ఆన్ లైన్ లో పతంజలి


బాబా రామ్ దేవ్ కి చెందిన ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి వాణిజ్య రంగంలో దూకుడును మరింత పెంచింది. తన ఉత్పత్తులతో, మార్కెటింగ్ వ్యూహాలతో ఇప్పటికే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు దడ పుట్టిస్తున్న పతంజలి తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆన్‌లైన్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నామని, ఇకపై హరిద్వార్‌ నుంచి హర్‌ ద్వార్‌ (ప్రతి గుమ్మం వరకూ) తమ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను అందిస్తామని వెల్లడించిం ది. ప్రముఖ ఇ-రీటైలర్లు , అగ్రిగేటర్లతో తమ భాగస్వామ్యాన్ని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇకపై ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌ బాస్కెట్‌ లాంటి పలు ఈ కామర్స్‌ సైట్‌లలో కూడా పతంజలి వస్తువులు అందుబాటులోకి రానున్నాయి. యోగా గురు బాబా రాందేవ్‌ మంగళవారం న్యూఢిల్లీలో ఈ విషయమై ఒక ప్రకటన చేసారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు ఇకపై అమెజాన్, ఫ్లిప్‌కార్ల్‌,షాప్‌ క్లూస్‌, బిగ్‌ బాస్కేట్‌, నెట్ మెడ్, వన్‌ ఎంజీ అఫీషియల్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. గృహోపకరణ దినుసులు కాక ఆయుర్వేద మందులు, పానీయాలు కూడా లభిస్తాయి. సోలార్‌ ఉత్పత్తులపై కూడా పతంజలి దృష్టి పెట్టింది. ఇప్పటి వరకూ ఉత్పాదక సంస్థతో నేరుగా ప్రమేయం లేకుండా ఇతర విక్రయదారుల ద్వారా అనేక ఆన్లైన్ ప్లాట్‌ ఫాంలలో పతంజలి వస్తువులు దొరుకుతున్నా.. ఇకపై ఒక క్రమపద్ధతిలో నేరుఆ పతంజలి సంస్థ ద్వారానే ఖాతాదారుల ముంగిటికి అవి రానున్నాయి.

ముఖ్యాంశాలు