EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

పార్టీ ఏర్పాటుకు టీటీవీ దినకరన్‌ నిర్ణయం

అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. కొత్తపార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం పుదుచ్చేరి లో మద్దతుదారులతో ఆయన మంతనాలు జరిపారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షు డు, మాజీ సీఎం ఎంజీఆర్‌ జయంతి వేడుకల నేపథ్యంలో దినకరన్‌ కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో దినకరన్‌ స్వతంత్ర్యగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. మూడు నెలలలో ప్రభుత్వం కూలిపోతుందని.. అన్నాడీఎంకే నుంచి బయటకు రావాలంటూ ఆ సందర్భంలో దినకరన్‌ నేతలకు పిలుపునిచ్చాడు. శశికళ జైలుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళని సామి, పన్నీర్‌సెల్వంతో కలిసి అన్నాడీఎంకే పార్టీపై పట్టుసాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శశికళ-దినకరన్‌ వర్గంపై వేటు వేసి, వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఓవైపు పార్టీలో సభ్యత్వం.. మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోయిన నేపథ్యంలోనే దినకరన్‌ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లు స్పష్టమౌతోంది.

Facebook