పోలీసులకు లొంగిపోయిన అమలాపాల్


నటి అమలాపాల్‌ త్రివేండ్రం క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయింది. పన్ను ఎగవేత కేసులో అమలాపాల్‌ నిందితురాలు. తప్పుడు చిరునామా పత్రాలు సృష్టించి రూ.20 లక్షల పన్నును ఆమె ఎగ్గొట్టారు. ఈమేరకు ఆమెపై కేరళలో కేసు నమోదైంది. 430, 468, 471 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. దీనిపై ఆమె కేరళ హైకోర్టుకు ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం దీనిపై స్పందిస్తూ మొదట క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని, ఆ తర్వాత కేసు పరిశీలి స్తామని పేర్కొంది. దీంతో అమలాపాల్‌ సోమవారం తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకి లొంగిపోయింది. తాను కారు రిజిస్ట్రేషన్ కోసం పాండిచ్చేరి లో తప్పుడు పత్రాలు చూపినట్లు ఆమె ఒప్పు కుందని సమాచారం. అమలాపాల్‌ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించింది. గత ఏడాది అమలాపాల్‌ రూ. కోటితో ఖరీదైన కారును కొని దాన్ని తప్పుడు పత్రాలతో పాండిచ్చేరిలో రిజిస్టర్‌ చేయించింది. కేరళలో పన్ను ఎగవేయడానికే ఆమె ఇలా చేసిందని కేసు నమోదైంది. కాగా రాజ్యసభ సభ్యుడు, హీరో సురేష్ గోపి, ప్రముఖ దర్శకుడు ఫాసిల్ కూడా ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సురేష్ గోపి కూడా ఈరోజే అరెస్టయి బెయిల్ పై విడుదలయ్యారు.

ముఖ్యాంశాలు