హజ్ యాత్రికులకు రాయితీ ఉపసంహరణ


కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. హజ్‌ యాత్రికులకు ఇస్తున్న రాయితీని రద్దు చేయాలని నిర్ణయించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మంగళవారం ఈ సంగతి వెల్లడించారు. భారత్‌ నుంచి ఈ ఏడాది 1.75లక్షల మంది యాత్రికులు ఏ రాయితీ లేకుండా హజ్‌ యాత్రకు వెళ్తున్నారని తెలిపారు. రాయితీ ఉపసంహరణ వలన ప్రభుత్వానికి రూ.700కోట్లు ఆదా అవుతుందని మంత్రి చెప్పారు. ఈ నిధులను ముస్లిం బాలికల విద్యకు ఉపయోగి స్తామన్నారు. రాయితీ వల్ల ముస్లిం ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆయన చెప్పారు. ఇకపై సముద్ర మార్గం ద్వారా కూడా భారత యాత్రికులు హజ్‌ చేరుకునేందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది దాదాపు 1300 మంది మహిళలు పురుషుల తోడు (మెహ్రం) లేకుండా హజ్‌ యాత్రకు వెళ్తున్నారని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని ఇటీవల మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని కూడా ప్రస్తావించారు.

ముఖ్యాంశాలు