ప్రయాణ సమయం తగ్గించే రైల్వే కారిడార్లు

‘స్వర్ణ చతుర్భుజి’ పేరుతో ఉన్న రహదారి ప్రాజెక్టులకి సమాంతరంగా రైల్వే కారిడార్లు ఏర్పాటు ఒక ప్రణాళిక. ప్రయాణ సమయాన్ని దాదాపు సగానికి తగ్గించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదించారు. అయితే ఇది చాలా భారీ ప్రాజెక్టు కావడంతో దశలవారీగా పనులు చేపడుతున్నారు. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలను కలుపుతూ హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ రైళ్లను ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నడపాలని ఆ ప్రణాళిక నిర్దేశిస్తోంది. వీటిలోగత కేంద్ర బడ్జెట్‌లో దిల్లీ-ముంబయి, దిల్లీ-హౌరా కారిడార్‌కు రూ.11,189కోట్లు కేటాయిం చారు. ఇక మిగిలిన దిల్లీ-చెన్నై, చెన్నై-హౌరా,  చెన్నై-ముంబయి, హౌరా-ముంబయి కారిడార్‌లను హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ కారిడార్లుగా మార్చాల్సి ఉంది. ఈ మార్గాల్లో రైళ్లు గంటకు రూ.160 కి.మీ. నుంచి 200 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. మిగిలిన రెండు కారిడార్‌లను పూర్తి చేయడానికి సుమారు రూ.40,000 కోట్లు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 2018 రైల్వే బడ్జెట్‌లో మిగిలిన కారిడార్‌లకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దేశ 75వ స్వాతంత్ర్యదినోత్సవం ఆగస్టు 15, 2022 నాటికి ‘స్వర్ణ చతుర్భుజి’ మార్గంలో హైస్పీడ్‌ రైళ్ల నడక మొదలు కావాలని ప్రభుత్వ లక్ష్యం.
 

Facebook
Twitter