మీరంతా మోదీని మాత్రమే తిట్టాలి!


జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తెదేపాను బలహీనపరిస్తే పవన్ఏం కళ్యాణ్ కి ఏమి లాభం వస్తుందని నిలదీశారు. జనసేన నాయకుడు తనను విమర్శంచడమేమిటని ఆగ్రహించారు. నాలుగేళ్లు కనబడని అవినీతి ఇప్పుడు కనబడిందా? అని ప్రశ్నించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఆదరణ పథకం ప్రారంభోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘కొందరు మన రాష్ట్ర నాయకులు భాజపాకు వంత పాడుతున్నారు. ఇది దుర్మార్గం. ఇటీవల వైకాపా నేతలు నన్ను విమర్శించి కేంద్రాన్ని ఏమీ అనడంలేదు. ఇక్కడ మాటలు మాట్లాడుతున్నారు. దిల్లీలో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. కేసుల మాఫీ కోసం రాజీపడి హక్కులు తాకట్టుపెట్టే పరిస్థితికి వస్తున్నారు. భావితరాల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. అలాగే పవన్‌ మాట్లాడారు. ఈ కష్ట సమయంలో ఎవరైనా కేంద్రం మోసాన్ని, నరేంద్ర మోదీని నిలదీయాలి. హక్కుల కోసం పోరాడకుండా నన్ను బలహీనపరిస్తే ఆయనకొచ్చే లాభమేంటి? రాష్ట్రానికి వచ్చే ప్రయోజనమేంటి? ప్రజల ద్వారా అడుగుతున్నా. ఇవన్నీ చాలా దుర్మార్గం. నాలుగేళ్లు మీరు మాట్లాడకుండా ఈరోజు వచ్చి ఇలా మాట్లాడతారా? ఎప్పుడూ కనబడని అవినీతి ఇప్పుడు కనబడిందా? ఇదెక్కడి చోద్యం. నాలుగేళ్లు ఓపిక పట్టాను. ఈ నాలుగేళ్లలో భాజపా రాష్ట్రానికి అన్యాయం చేస్తే అన్ని విధాలా ప్రయత్నాలు చేశాను. నాలుగో బడ్జెట్‌లోనూ భాజపా మొండిచేయి చూపింది. భరించలేకపోయాను. పన్నుల రూపంలో మనం ఇచ్చిన డబ్బులే తిరిగి మనకు ఇస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవం కోసం పోరాడితే నేను ఆత్మవిశ్వాసం నింపేందుకు కృషిచేశా. ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే అంతలా పోరాడతాం. ఎన్నో కుట్రలను తెదేపా సమర్థంగా ఎదుర్కొంది. తమిళ రాజకీయాల మాదిరిగా కేంద్రం ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టింది. అని చంద్రబాబు విమర్శించారు. డబ్బులు ఇవ్వకుండా, హోదా ఇవ్వకుండా మోదీ రాష్ట్రాన్ని మోసం చేశారు. చెప్పింది చేయమని అడిగితే వేరేవాళ్లను రెచ్చగొడుతున్నారు. ఇదేమి రాజకీయం అని బాబు అన్నారు. నలభయ్యేళ్ల తన రాజకీయ జీవితంలో ఎవరికీ భయపడలేదన్నారు.

ముఖ్యాంశాలు