తమిళనాడులో బ్రిడ్జి పైనుంచి పడిన వ్యాన్.. ఆరుగురి మృతి

తమిళనాడు తుత్తుకుడి జిల్లా దళవాయుపురం వద్ద ఓ వ్యాన్‌ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందకు నీటిలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్సకు తరలించారు. 

Facebook
Twitter