ఐర్లాండ్‌లో బతుకమ్మ సంబరాలు


ఐర్లాండ్‌లోని ప్రవాస తెలంగాణ వాసులు (Telanganites Of Ireland) బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 30 మంది వాలంటీర్స్ ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ పండుగ జరిగింది. వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 600 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ మరియు దాండియా ఆటలను ఉల్లాసంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ విశేషాలు వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ మరియు దాండియా ఆటలు ఆహూతులను ఆకట్టుకున్నాయి . UK నుండి సింగర్ స్వాతి రెడ్డి విచ్చేసి బతుకమ్మ పాటలు పాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మను పేర్చి తెచ్చిన ఆడపడుచులకు బహుమతులు అందజేశారు. వేడుకలో ఇక్కడి ప్రాంతీయ ఎంపీలు(TDs) Ruth Coppinger , Jack Chambers మరియు కౌన్సిలర్ Mary McCamley పాల్గొన్నారు. శ్రీనివాస కార్పే, సాగర్, ప్రబోధ్ మేకల, జగన్ రెడ్డి మేకల, కమలాకర్ కోలన్, సంతోష్ పల్లె, రవీందర్ రెడ్డి చప్పిడి, రాజేష్ అది, దయాకర్ రెడ్డి కొమురెల్లి ,శ్రీనివాస్ పటేల్ , సుమంత్ చావా ,అల్లే శ్రీను , నగేష్ పొల్లూరు , త్రీశిర్ పెంజర్ల , ప్రదీప్ యల్క,,ప్రవీణ్ లాల్ ,వెచ్చ శ్రీను ,వెంకట్ తీరు ,సునీల్ పాక , అల్లంపల్లి శ్రీనివాస్ , షరీష్ బెల్లంకొండ , శ్రీకాంత్ సంగి రెడ్డి , రమణ యానాల , రామ్ రెడ్డి , వెంకట్ గాజుల , వెంకట్ జూలూరి , వెంకట్ అక్కపల్లి , నవీన్ జనగాం , రాజా రెడ్డి తదితరులు కార్యక్రమ నిర్వహణలో శ్రమించారు.

ముఖ్యాంశాలు