తిరుపతిలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం


తిరుపతి నగరంలోని వివి మహల్ రోడ్డులో నిన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ నూతన వ్యాపార సంస్థ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సినీ తారలు మెహరీన్ కౌర్, రాశి ఖన్నా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసారు. వేలాదిమంది అభిమానులు, విని యోగదారులు పాల్గొన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకట రమణ మాట్లాడుతూ ఈ సందర్భంగా తమ విక్రయ సంస్థలో వినియోగదారులకు భారీ రాయి తీలు ఇస్తున్నామని, అరుదైన, నాణ్యమైన నగలు, దుస్తులను అందుబాటులో ఉంచా మని తెలిపారు. సామాన్యులకు కూడా అందుబాటులో మంచి వస్త్రాలు అందించాలన్న లక్ష్యానికి కట్టుబడ్డామని అయన అన్నారు. మెహరీన్ మాట్లాడుతూ తిరుపతి బాలాజీని దర్శనం చేసుకున్నానని ఆనందంగా చెప్పారు. ఈ షాపింగ్ మాల్ వృద్ధిలోకి రావాలన్నారు. రాశి ప్రసంగిస్తూ ఇక్కడి చీరలు, నగలు తన మదిని దోచాయన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం