జై సింహా నిర్మాత కార్యాలయంలో ఐటీ తనిఖీలు


నందమూరి బాలకృష్ణ సినిమా ‘జై సింహా’ చిత్రం కలెక్షన్లు, అందుకు చెల్లించిన ఆదా యపు పన్నులపై ఐటీ శాఖ కన్నేసింది. హైదరాబాద్ కృష్ణానగర్‌లోని చిత్ర నిర్మాత సి.కల్యాణ్‌ కార్యాలయంపై బుధవారం సోదాలు చేపట్టింది. ఆరుగురితో కూడిన ఐటీ అధికారుల బృందం ఈ తనిఖీలు జరిపింది. సుమారు రూ.30కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘జై సింహా’ తొలివారంలోనే రూ.25కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుందని ప్రచారం జరుగు తోంది. వీటికి నిర్మాత ఆదాయపు పన్ను సక్రమంగా కట్టారా? అనే విషయమై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఐదు రోజులపాటు అన్ లిమిటెడ్ షోలకు ఈ చిత్రానికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వేసిన షోలు, వచ్చిన కలెక్షన్లకు లెక్కలు సరిగ్గా చూపారా లేదా అనే విషయమై ఈ తనిఖీల్లో దృష్టి సారించారని సమాచారం.కల్యాణ్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ‘జై సింహా’తర్వాత వి.వి.వినాయక్‌, సాయిధరమ్‌తేజ్‌ కాంబినేషన్‌లో చిత్రానికి సి.కల్యాణ్‌ భారీ బడ్జెట్‌తో కమిటయ్యారు.

ముఖ్యాంశాలు