ముస్లిం రిజర్వేషన్లు ఇంకా పెంచాలి - కేసీఆర్


ఇండియాటుడే నిర్వహించిన కాన్‌క్లేవ్‌ కార్యక్రమంలో రాజ్‌దీప్‌ సర్దేశాయి తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ భిన్న సంప్రదాయాల సమ్మేళనమే హైదరాబాద్‌ అని తెలిపారు. తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌ ఏమాత్రం పోటీపడలేదని కూడా ఆయన అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల కోటా ఇప్పుడు ఉన్న 50శాతం ఏమాత్రం సరిపోదన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయాలని భావించారు. హైదరాబాద్‌ను గుజరాత్‌, సింగపూర్‌తో పోల్చడం కరెక్ట్ కాదని... ఇప్పుడున్న సెక్రటేరియట్‌ భవనం సౌకర్యవంతంగా లేదని మలేషియా మంత్రి ఒకరు తనతో చెప్పారని కేసీఆర్‌ వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు హైదరాబాద్‌ అభివృద్ధిని విస్మరించారన్నారు. హైదరాబాద్‌ నగర పునర్నిర్మాణానికి రూ.25వేల కోట్లు అవసరమన్నారు. తన కుటుంబ సభ్యులు తెలంగాణ కోసం జైలుకు వెళ్లారని, వారిని తెలంగాణ ప్రజలు అభిమానంగా ఎన్నుకున్నారు తప్ప తాను ఎవరినీ ఎంపిక చేయలేదని వెల్లడించారు. 2020 నాటికి రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. దిల్లీ రాజకీయాలపై తనకెంతమాత్రం ఆసక్తి లేదని, రాష్ట్రమే ప్రధానమని స్పష్టం చేసారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం