విమానాలకు మొబైల్ బ్యాటరీల భయం


విమానాల్లో మొబైల్ బ్యాటరీలు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పేలుడు ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకమీదట వ్యక్తిగత ఎలక్ట్రానిక్‌ వస్తువులైన ల్యాప్‌టాప్‌, ఫోన్లు, పవర్‌బ్యాంక్‌లు చెక్‌-ఇన్‌(లగేజీ) బ్యాగుల్లో కాకుండా క్యాబిన్‌ బ్యాగు(హ్యాండ్‌ బ్యాగు)ల్లోనే పెట్టుకునేలా నిబంధనలు తీసుకురావాలని అంతర్జాతీయ విమానయాన సంస్థలు యోచిస్తున్నాయి. ఇటీవల ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తాలూకు బ్యాటరీలు తరచుగా పేలిపోతున్నాయి. అలాంటి సమయాల్లో ఆ వస్తువులు కార్గోలో ఉండటం కంటే క్యాబిన్‌లో ఉంటేనే ప్రమాదాన్ని వెంటనే అదుపులోకి తీసుకురావచ్చని విమానయాన సంస్థలు భావిస్తున్నాయట. అందుకే చెక్‌ఇన్‌ బ్యాగుల్లో ఉన్న అలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను క్యాబిన్‌ బ్యాగుల్లోకి మార్చుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నాయి. కాగా ఎలక్ట్రానిక్‌ వస్తువులను చెక్‌ ఇన్‌ బ్యాగుల్లోకి అనుమతించడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఒక పరిశీలన చేపట్టింది. కార్గోలో వ్యక్తిగత ఎలక్ట్రానిక్‌ వస్తువుల బ్యాటరీలు పేలిపోతే అది విమానానికి ప్రమాదం కలిగిస్తుంది కనుక వీటిని అనుమతించరాదని అమెరికన్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అభిప్రాయపడుతోంది. దీనిపై తన అధ్యయనాలను ఈ సంస్థ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు అందజే సింది. దీనిపై అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నాయి.. ఆపైన అదేబాటలో భారత సంస్థలు కూడా నడవనున్నాయి.

ముఖ్యాంశాలు