జపాన్ లో చిరు ఫోటో.. కేటీఆర్ సంభ్రమం


తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జపాన్‌లోని షిజ్వోకా ప్రాంతంలోని హమామట్సు అనే పట్టణంలో ఉన్న సుజుకి మ్యూజియంను గురువారం చూసారు. అక్కడ మెగాస్టార్‌ చిరంజీవి ఫొటోను చూసి కేటీఆర్‌ సంభ్రమానికి లోనయ్యారట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఆ ఫొటో పోస్ట్‌ చేశారు. ‘సుజుకి మ్యూజియం సందర్శన అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఎవరి ఫొటో చూశానో ఊహించగలరా? మన మెగాస్టార్‌ చిరంజీవి. మన మాతృభూమికి చెందిన వారి ఫొటోను ఇంత సుదూరంలో చూడటం గర్వంగా అనిపించింది’ అని ఆ ట్వీట్ లో కేటీఆర్ పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు