దుర్గమ్మ సన్నిధిలో మహారాష్ట్ర గవర్నర్


మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు గురువారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఇంద్రకీలాద్రికి రాగా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ పుష్పవర్ధన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో విద్యాసాగర్‌రావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు అపార అవకాశాలు ఉన్నాయ న్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరు ఆకట్టుకుంటున్నదని చెప్పారు.

ముఖ్యాంశాలు