ఫారెస్ట్ అకాడమీలో స్టడీ టూర్ ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఐదవ బ్యాచ్ ఫారెస్ట్ బీట్ అధికారుల అధ్యయన యాత్ర (స్టడీ టూర్) శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాత్ర ఈనెల 31 వ తేదీ వరకూ 14 రోజులు కొనసాగుతుంది. యాత్రలో 28 మంది ఎఫ్ బి ఓ లు పాల్గొంటున్నారు. ఈ అధ్యయన యాత్రను అకాడమీ డైరెక్టర్ జెఎస్ఎన్ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో తెలుసుకున్న అనేక సాంకేతిక, వైజ్ఞానిక అంశాలను ప్రయోగాత్మకంగా చూసి అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయన యాత్ర ఉపయోగపడుతుందన్నారు. తలకోన ఫారెస్ట్, ఎస్వీ జూ పార్క్, రెడ్ సాండర్స్ గోడౌన్ (ఎర్రచందనం), వైఎస్ఆర్ స్మృతివనం, రోళ్ళపాడు అభయారణ్యం, శ్రీశైలం టైగర్ రిజర్వ్, వెలుగొండ ఇరిగేషన్ ప్రాజెక్టు, దూబచర్ల బాంబూ గార్డెన్స్, జంగారెడ్డి గూడెం లాగింగ్ డివిజన్ వంటివాటిని ఈ అధ్యయన యాత్రలో ట్రెయినీలకు చూపించి వాటి విశేషాలు వివరిస్తారని పేర్కొన్నారు. యాత్రలో సందర్శించే ప్రతి ప్రాంతానికీ సంబంధించి న విశేషాలను, అక్కడ నివృత్తి చేసుకోవలసిన అంశాలను ఫ్యాకల్టీ సభ్యులు ట్రెయినీలకు వివరించారు. అధ్యయన యాత్ర ప్రారంభ కార్యక్రమంలో అకాడమీ డెప్యూటీ డైరెక్టర్లు ఎం వి ప్రసాదరావు, ఎ. శ్రీహరి గోపాల్, ఫ్యాకల్టీ సభ్యులు రాజేంద్రప్రసాద్, నాగేశ్వరరావు, శ్యాంబాబు, ఎస్ఓ నీలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు