భారత్ లో ఉన్నవారంతా హిందువులే!


భారత్‌లో నివసించే ఎవరైనా హిందువే అని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ అన్నారు. హిందుత్వ అంటే అన్ని మతాలను కలుపుకొని పోవడమే అన్నారు. హిందుత్వ అనేది హిందూయిజానికి భిన్నమైనదని చెప్పారు. త్రిపుర రాజధాని అగర్తలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమకు ఎవరిపైనా శత్రుత్వం లేదని, అందరి సంక్షేమమే తమ లక్ష్యం అని చెప్పారు. అందరూ కలిసి ఉండడమే హిందుత్వ అని భగవత్‌ సూత్రీకరించారు. ఐదురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన త్రిపుర చేరుకున్నారు. అంతకుముందు ఈశాన్య రాష్ట్రాల్లో ఆరెస్సెస్‌ కార్యక్రమాలకు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు.

ముఖ్యాంశాలు