ప్రమాదం తప్పినది విశ్వేశ్వరుని గుడికి కాదు.. విశ్వానికి!


కాశీలోని విశ్వేశ్వరాలయాన్ని పేల్చివేసే కుట్రతో అక్కడ భూగృహాలను నిర్మించారు ముష్కరులు. దైవ వశాత్తు ఇవి బయటపడ్డాయి గనుక ప్రస్తుతానికి ప్రమాదం లేదు! అయితే ఈ ప్రమాదం తప్పినది విశ్వేశ్వరుని గుడికి కాదు.. విశ్వానికి! ఎన్ని ప్రళయాలు వచ్చినా భూమి మీద ఒకే ఒక్క నగరం.. అదే పేరుతో.. అదే గాధతో.. ఉనికిని నిలుపుకొని ఉంది.. అదే కాశీ! కృతయుగంలో హరిశ్చంద్రుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు... ఇక కలియుగాన శంకరాచార్యులు.. ఇలా ఏ మహితాత్ముల చరిత్రలు చదివినా... ఏ పురాణం తరచినా కాశీ ఉంటుంది.. అదే వర్ణన.. అదే దేవతలు... అదే మహిమ...! అటువంటి కాశీకి ముప్పు వాటిల్లే పరిస్థితి ఎప్పుడో కానీ రాదు.. అలాంటి పరిస్థితి వచ్చిన మరుక్షణం ప్రళయం వస్తుంది... ఆ విలయంలో సర్వం నశిస్తుంది.. మళ్ళీ ఎప్పట్లా కాశీ మాత్రం ఠీవిగా నిలిచి ఉంటుంది... ఇది యుగయుగాల చరిత్ర చెప్పిన సత్యం! శివుడు సర్వమంగళ స్వరూపుడు... తేడా వస్తే లయకారుడు! ఇంతకీ భూగృహాల అసలు కథ చూద్దాం! విశ్వనాథాలయ సమీపంలో దాల్మాన్దీ ప్రాంతంలో ఎనిమిదివేల చదరపు అడుగుల ఈ భూగ్రహం రొటీన్ పెట్రోలింగ్ విధుల్లో భాగంగా పోలీసు అధికారుల కంటపడింది. హఫీజ్ మాస్క్ (మసీదు) ఎదురుఆ ఒక ఇంటినుంచి సన్నటి మార్గంగా ఈ భూగృహాలకు దారి ఉంది. ఇందులో నలభై పేజీగా స్థావరాలు, కొన్ని కంటైనర్లు ఉన్నాయని అంటున్నారు. భూమి లోపలినుంచి ఆలయాన్ని పేల్చివేసే కుట్రలో భాగంగా ఇది నిర్మిస్తున్నారా.. లేక ప్రధాని మోడీ నియోజకవర్గం కావడంతో ఆయన లక్ష్యంగా ఇది చేస్తున్నారా ఏది తేలాల్సి ఉంది. ప్రస్తుతం కాశీలో స్థానిక మునిసిపల్, రెవెన్యూ అధికారులు, అనుమానితులు, పాత నేరస్తులు సహా వందలాది మందిని దీని విషయమై ప్రత్యేక దళాలు ప్రశ్నిస్తున్నాయి. దేశం ఉలిక్కిపడే ఈకుట్ర చూస్తుంటే.. ఆలయాలకు పక్కనే మసీదులు ఉండడం ఎంత ప్రమాదకరమో అర్థం అవుతున్నది.

ముఖ్యాంశాలు