8వేల ఉద్యోగాల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్‌


దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) విభాగంలోని పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 400, తెలంగాణలో 255 ఖాళీలు కూడా వీటిలో ఉన్నాయి. ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. జనవరి 1, 2018 నాటికి 20-28 ఏళ్లలోపు వయస్కులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు పరీక్షల్లో మైనస్‌ మార్కులుగా ప్రతీ తప్పునకు పావుశాతం కొత్త ఉంటుంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలు మార్చి/ఏప్రిల్‌లో, మెయిన్స్‌ మే 12న నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు: ఏపీలో చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ అని ఎస్ బి ఐ నోటిఫికేషన్ తెలిపింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం