కొలువుదీరిన కర్నాటకం

కర్ణాటక విధాన సభ కొలువుదీరింది. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ బోపయ్య సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. తొలుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య

ప్రమాణం చేశారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. ప్రమాణ స్వీకారం అనంతరం సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప సర్కార్‌ బలనిరూపణ జరగనుంది. విశ్వాస పరీక్షలో ప్రొటెం స్పీకర్‌ పాత్ర కీలకం. ఓట్లు లెక్కించి ఫలితాన్ని ప్రొటెం స్పీకర్‌ వెల్లడించనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా బొపయ్య నియామకాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీం బోపయ్య నియామకాన్ని సమర్థించింది.

ముఖ్యాంశాలు