ఆ ఇరవై మంది ఏం చేయనున్నారు?


కర్ణాటకలో యెడ్యూరప్ప బలపరీక్ష నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భాజపా బలపరీక్షలో నెగ్గుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలు భాజపాలోకి వెళ్లకుండా కాపాడుకునే పనుల్లో తలమునకలై ఉన్నారు. అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌ల లోని లింగాయత్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కాంగ్రెస్‌లో 18మంది, జేడీఎస్‌లో ఇద్దరు లింగాయత్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్ష సమయంలో లింగాయత్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి యడ్యూరప్పకు మద్దతు ఇస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ వైఖరి పట్ల లింగాయత్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారని, గతంలో తమ వర్గాన్ని విడదీసేందుకు ప్రయత్నించడమే కాకుండా ఇప్పుడు లింగాయత్‌కు వ్యతిరేకంగా భావిస్తున్న జేడీఎస్ పార్టీ‌తో పొత్తు పెట్టుకోవడంతో వారు నిరాశ చెందారని ఓ భాజపా నేత పేర్కొన్నారు. గవర్నర్‌ ఆహ్వానంపై భాజపా అభ్యర్థి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, మనస్సాక్షి ప్రకారం శాసనసభ్యులు బలపరీక్షలో ఓట్లు వేయాలని కోరడం తెలిసిన విషయాలే.

ముఖ్యాంశాలు