EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందా?..

యడ్యూరప్ప రాజీనామా చేయగానే బీజేపీ వ్యతిరేకులు, కొందరు మేతావుల వ్యాఖ్యానాలు చూస్తుండే ప్రజాస్వామ్యమే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 సీట్లు వచ్చాయి.. కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అంతకన్నా ముఖ్యంగా జేడీఎస్ ను అసలు సోదిలోకి తీసుకోకుండా మూడో స్థానంలో కూర్చోబెట్టారు.. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవరైనా ఈ నిజాన్ని అంగీకరించాలి..

జేడీఎస్-కాంగ్రెస్ లను ఎన్నికల ముందు ఎలాంటి పొత్తు లేదు. పైగా ఎన్నికల ప్రచారంలో పరస్పరం విమర్శించుకున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రజా తీర్పును గౌరవించే సంస్కారం లేకుండా దొడ్డి దారిన అధికారంలోకి రావడానికి స్కెచ్ వేసింది. కేవలం 38 సీట్లు వచ్చిన జేడీఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.

బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 111 సీట్లను చేరుకోకపోవచ్చు.. కానీ ప్రజలు ఆ పార్టీకి అత్యధిక సీట్లు కట్టబెట్టారు. ఆనవాయితీ ప్రకారం గవర్నర్ అత్యధిక సీట్లు వచ్చిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పిలిచారు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయగానే తమ వారసత్వ అధికారం ఏదో పోయినట్లు ప్రజల తిరస్కారం పొందిన కాంగ్రెస్, జేడీఎస్ లు గగ్గోలు.. క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. గవర్నర్ బల నిరూపణకు యడ్యూరప్పకు 15 రోజుల గడువిస్తే, కోర్టుకు వెళ్లి ఒక రోజుకు కుదించారు.

ఇక్కడ బీజేపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేసిందా? అన్నది దేవుడెరుగు.. కానీ తామేదో పరిశుద్దులం అన్నట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడం చూస్తుంటే పిల్లి శాఖాహార వ్రతం చేపట్టినట్లు కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలను నిర్లజ్జగా కూల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎక్కడి దాకో ఎందుకు.. సమైక్యాంధ్రప్రదేశ్ లో నాదెండ్ల భాస్కర రావుతో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని పడగొట్టడం, గుజరాత్ లో కేశూభాయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాఘేలాను ఉపయోగించుకొని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం మన కళ్ల ముందు కనిపించిన సమకాలీన చరిత్ర.. రామజన్మభూమిలో వివాదాస్పద కట్టడాన్ని కర సేవకులు కూల్చేసిన ఘటనను అడ్డు పెట్టుకొని బీజేపీ పాలిత రాష్ట్రాలను భర్తరఫ్ చేయడం కూడా చూశాం.

ఇప్పుడు కర్ణాటకలో ప్రజల తీర్పుకు వెన్నుపోటు పొడిచి భాజపా ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ఎలాంటి నీతి సూత్రమో దేశ ప్రజలే అర్థం చేసుకోవాలి.. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేసిందని అపర మేతావులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ అత్యధిక సీట్లు తెచ్చుకున్న పార్టీలు ముందకు రాకపోతేనే బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందనే వాస్తవాన్ని ఎందుకు అంగీకరించరు.. గొండట్లో అన్నం తింటూ ఇతరుల కంచంలో వెంట్రుకలు చూపించే విధానం ఇది..

ప్రవేశ పరీక్షలో కనీస మార్కులు కూడా లేని కుర్రాడికి మొదటి ర్యాంకు కట్టబెట్టి ఉద్యోగం ఇచ్చి, ఫస్టు క్లాసులో పాస్ అయిన వాని మార్కుల జాబితాపై సిరా పోసి ఫెయిల్ అంటే ఎలా ఉంటుంది.. కర్ణాటకలో జరిగింది అదే..