సిద్ధమవుతున్న బిజెపి కేంద్ర కార్యాలయం


భారతీయ జనతా పార్టీ దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో సరికొత్త కార్యాలయ భవనాన్ని నిర్మిస్తోంది. న్యూ ఢిల్లీ లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ లో ఐదు అంతస్తుల భవనాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయం కోసం నిర్మిస్తున్నారు. వాహనాల పార్కింగ్ సౌకర్యంతోపాటు అత్యంత అధునాతన సదుపాయాలతో ఏడాదిన్నరకాలంలోనే రికార్డు సమయంలో ఈ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కార్యాలయ భవన నిర్మాణం 99 శాతం పూర్తి అయిందని టీవీ సెట్లు, టెలిఫోన్ కనెక్షన్లు ఇవ్వడమే తరవాయి అని బీజేపీ నాయకుడొకరు చెప్పారు. సెంట్రల్, పాతఢిల్లీకి మధ్య రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ ను కలుపుతూ నిర్మిస్తున్న ఈ భవనంలో హాలుతోపాటు గ్రంథాలయం, వీడియో కాన్ఫరెన్స్, మీడియా గది నిర్మించారు. మరో రెండు నెలల్లో బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం