సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడుతున్న పాక్

పాకిస్తాన్‌ తెరచాటు యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. భారత పల్లెలే లక్ష్యంగా విచక్షణ లేని దాడులు జరుపుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి గత మూడురోజుల్లో పలుమార్లు కాల్పులకు పాల్పడింది. కాగా  భారత పల్లెలే లక్ష్యంగా పాక్‌ బలగాలు జరుపుతోన్న కాల్పుల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది చనిపోయారు. వారిలో ఐదుగురు సాధారణ పౌరులుకాగా, ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, ఇద్దరు ఆర్మీ సిబ్బంది ఉన్నారు. ఇటీవల భారత సైన్యం మినీ సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి పాక్‌ బలగాల్ని మట్టుపెట్టిన తర్వాత సరిహద్దులో మళ్లీ తీవ్ర యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో సరిహద్దు వెంబడి భయానకవాతావరణం నెలకొంది. సరిహద్దు జిల్లాలు ఐదింటిలో వాస్తవాధీన రేఖకి దగ్గరగా ఉన్న పాఠశాలలను శనివారం నుంచి మూయించివేశారు. ‘జమ్ము, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్‌ జిల్లాల్లో సరిహద్దులను ఆనుకుని ఉన్న పాఠశాలల్ని మూసేశాం. మరో మూడురోజుల వరకు వీటికి సెలవులు... ఆ తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి ఆదేశాలు జారీచేస్తాం’ అని సంబంధిత అధికారులు మీడియా ప్రకటనల్లో స్పష్టం చేసారు. 

Facebook