అర్ధరాత్రి ఆకాశంలో వింత వెలుగులు


అర్ధరాత్రి ఒక్కసారిగా ఆకాశంలో భారీ వెలుగు కనిపిస్తే ఎలా ఫీలవుతారు!! అక్కడ అదే జరగడంతో ఉత్తర సైబీరియా ప్రజలకు అసలేమీ జరుగుతున్నదో అర్థం కాలేదు. గుండ్రటి ఆకారంలో ఆకాశం నుంచి పెద్ద వెలుగును అందరూ గుర్తించారు. కొందరు ఫోటోలు కూడా తీశారు.. మరి కొందరు భయంతో పరుగులు తీశారు. ఏలియన్లు (గ్రహాంతరవాసులు) రష్యాలో దిగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో పోస్టులు వెల్లు వెత్తాయి. సైబీరియన్లు భయంతో బెంబేలెత్తారు. ఆతర్వాత తేలింది ఏమిటంటే ఆకాశంలో వచ్చిన వెలుగు మిలటరీ ఏకకాలంలో చేసిన నాలుగు రాకెట్ల ప్రయోగం వల్ల ఏర్పడిన వెలుగుని, లేదా ఉత్తర ధ్రువం నుంచి వచ్చే వెలుగు కావొచ్చని! భయాందోళనలకు గురికావొద్దంటూ రష్యన్‌ టీవీ అత్యవసర ప్రసారం చేయడంతో స్థానికులు తెప్పరిల్లారు. 2009లో నార్వేలో కూడా అర్థరాత్రి ఇటువంటి వెలుగులు కనిపించాయి... అప్పుడు కూడా రాకెట్ ప్రయోగాలే కారణమని తేలింది.

ముఖ్యాంశాలు