బీహార్ సీఎం నితీష్ కు జెడ్ ప్లస్ భద్రత


బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ స్థాయి భద్రతను కల్పించింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆయన బక్సర్‌లో పర్యటించిన సందర్భంగా కొంతమంది అయన కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసి భద్రతా సిబ్బందిని గాయపరిచారు. దీంతో ఆయనకు భద్రతను పెంచాలని నిర్ణయించారు. జెడ్ ప్లస్ కేటగిరీ కింద నితీష్ కి దాదాపు 40 మంది పారామిలటరీ సిబ్బంది భద్రతగా ఉంటారు. కాగా బాక్సర్ దాడిలో కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడికి బాధ్యులని అనుమానిస్తూ పోలీసులు 28 మందిని అరెస్టు చేశారు.

ముఖ్యాంశాలు