కొండగట్టు నుంచి పవన్‌ కల్యాణ్‌ యాత్ర


జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం రాత్రి ట్విట్టర్ లో ప్రకటించారు. 2009 ఎన్నికల్లో ప్రచారం సమయంలో ఒక ప్రమాదం నుంచి తాను ఇక్కడే బయట పడ్డానని, తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి అని పేర్కొంటూ.. అందుకే తన రాజకీయ యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మొదట సర్వమత ప్రార్ధనలు జరుగుతాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సులను అర్థిస్తున్నట్టు తెలిపారు. తన రాజకీయ యాత్ర వివరాలను, ప్రణాళికలను కొండగట్టులోనే ప్రకటించనున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు