ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి


దిల్లీ లోని బవానా ప్రాంతంలో గల పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్‌ పరిశ్రమ గోడౌన్ లో శనివారం రాత్రి 9 గంటల వేళ ఘోర అగ్ని ప్రమాదం జరిగి 17 మంది మరణించారు. మూడంతస్తుల ఈ పరిశ్రమలో చెలరేగిన ఈ మంటల్లో తొలి అంతస్తులో 13 మంది మృతి చెందగా, కింది అంతస్తులో మరో నలుగురు మరణించారు. 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొందరు కార్మికులు పైనుంచి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ముఖ్యాంశాలు