రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహకరించాం


విభజన చట్టం మేరకు రాష్ట్రానికి కేంద్రం అన్ని నిధులు కేటాయించిందని, 15శాతం మాత్రమే ఇంకా బకాయి ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలో మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెదేపా, వైకాపా, వామపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో 80 శాతం కేంద్రప్రభుత్వ నిధులతో జరుతున్నవేనన్నారు. కేంద్రం నిధులు కేటాయించలేదని కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. పోలవరం ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుందని పార్లమెంట్‌లో స్పష్టం చేశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గురించి బడ్జెట్‌లో ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర నిధులతో సంతృప్తి చెందిన సీఎం చంద్రబాబు గతంలో పత్రికాముఖంగా పలుమార్లు స్పందించారంటూ క్లిప్పింగ్స్‌ను చూపించారు. ఏ రాష్ట్రం సాధించని స్థాయిలో నిధులు మనమే సాధించామని ఒకసారి, కేంద్రం అన్నీ ఇచ్చింది ఇంతకు మించి అడగలేమని ఇంకోసారి సీఎం పేర్కొన్నారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు కేంద్రం ఏమీ చేయలేదని ఎలా అంటున్నారని ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం