కమల్ - కేజ్రీవాల్ దోస్తానా


నటుడు కమల్‌హాసన్‌ మధురైలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇస్తున్న విందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని కమల్‌ హాసన్‌ సన్నిహితులు వెల్లడించారు. కేజ్రీవాల్‌ మధురైలో జరిగే బహిరంగ సభకి కూడా హాజరు కానున్నారు. గతంలో కేజ్రీవాల్‌ స్వయంగా కమల్‌ ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. గత ఏడాది సెప్టెంబరులో కేజ్రీవాల్‌ కమల్‌హాసన్‌ను కలిసి మాట్లాడారు. కమల్‌ రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు రావడంతో కేజ్రీవాల్‌ ఈ విషయంపై కమల్‌తో చర్చించారు. దేశంలో అవినీతి, మతతత్వం పెరిగిపోయాయని.. ఒకేలా ఆలోచించే నాయకులు కలిసి పనిచేయాలని అప్పుడు కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. ఇప్పుడు కమల్‌ పార్టీ పెడుతూ కేజ్రీవాల్‌ను ఆహ్వానించడం చూస్తే పొత్తుల దిశగా ఎదో జరుగుతున్నదని తెలుస్తూంది.

ముఖ్యాంశాలు