బ్యాంకుల రోగానికి ఇదిగో సరైన చికిత్స


ఎన్‌పీఏలతో సతమతమవుతున్న బ్యాంకులకు ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌ (ఐబీసీ) ఆయుధంగా దొరికింది. బ్యాంకులు మొండిబకాయిలపై ఈ చట్టాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే నష్టాల నుంచి గట్టెక్కడమే కాకుండా మరెవరూ బకాయిలు ఎగ్గొట్టే ధైర్యం చేయరు. భూషణ్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ సంస్థ బ్యాంకులకు దాదాపు రూ.48,000 కోట్లు బకాయి పడింది. దీంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి ఐబీసీ కింద చర్యలు చేపట్టింది. ఫలితంగా ఈ కంపెనీలో 72.65శాతం వాటాను టాటా స్టీల్‌కు చెందిన సబ్సిడరీ కంపెనీ బమినీ పాల్‌ స్టీల్‌ కొనుగోలు చేసి రూ.36,400 కోట్లు ఇచ్చింది. ఇపుడు బ్యాంకుకు మరో రూ.3857 కోట్లు వసూలు కావాల్సి ఉంది. దీనిలో ఇప్పటికే రూ.1542 కోట్లకు ప్రొవిజన్లు ఏర్పాటు చేసుకుంది. మరో రూ.3వేల కోట్లు వసూలు అయ్యే అవకాశం ఉంది. ఇలాగే దేశవ్యాప్తంగా ఉన్న పదకొండు భారీ మొండి బకాయిల విలువ లక్షకోట్లకు పైమాటే. దీంతో ఆర్‌బీఐ వీటిని కూడా ఎన్‌సీఎల్‌టీకి పంపించాలని సిఫారసు చేసింది. ఈ మొండి బకాయిలు దశాబ్దాల నాటివి... వీటికి శస్త్ర చికిత్స చేసి బ్యాంకింగ్ రంగాన్ని గాడిన పెట్టే కృషికి మాత్రం వయసు రెండేళ్లే! ఈ రెండేళ్ల కృషి.. ఆలోచనే ఈ సత్ఫలితాలను సాధిస్తున్నది..! ఇదీ మనం అర్థం చేసుకోవలసిన విషయం. ఒక విజన్ ఉన్న నాయకత్వంలో మన దేశం క్షేమంగా ఉంది. అందులో నో డౌట్. అన్నట్టు మన డబ్బులు తీసేసి మొండిబకాయిల కింద కట్టేసుకుంటారని... లేదా ఎక్కడి డబ్బో తెచ్చేసి బ్యాంకుల్లో లక్షలు మన అకౌంట్లలో వేసేస్తారని అడ్డదిడ్డంగా వాగే మూర్ఖులని పట్టించుకోనక్కర్లేదు అనే చిన్న నిజాన్నయినా ఈ పరిణామంతో మనం తెలుసుకుంటే దేశానికి చాలా మంచిది.

ముఖ్యాంశాలు