గజల్ శ్రీనివాస్ అరెస్టు


గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనను లైంగికంగా వేధించారని ఒక మహిళా రేడియో జాకీ చేసిన ఫిర్యాదుపై అతడిని అరెస్టు చేసారు. డిసెంబర్‌ 29న ఆ మహిళ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిందని పంజాగుట్ట ఎసిపి తెలిపారు. వెంకటరమణ కాలనీలో నివసించే ఈ మహిళను శ్రీనివాస్‌ తనను కొంతకాలంగా వేధిస్తున్నారని,ఇటీవల అవి ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పిందని తెలిపారు. ఈ ఆరోపణలు నిజమేనని దర్యాప్తులో తేలినట్టు పేర్కొన్నారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరపగా శ్రీనివాస్‌ లైంగిక వేధింపులకు పాల్పడటం, గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించడం నిజమేనని తేలిందన్నారు. కాగా ఈ ఆరోపణలన్నీ అసత్యాలని గజల్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆ అమ్మాయి తనపై ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదన్నారు. తన భుజానికి దెబ్బ తగిలితే ఆమె మందు రాసిందని, అంతే తప్ప ఆమెతో మసాజ్‌ చేయించుకున్నానన్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.

ముఖ్యాంశాలు