లివర్ పూల్ లో 1400 కార్లు దగ్ధం

బ్రిటన్లోని లివర్పూల్ లో బహుళ అంతస్తుల పార్కింగ్ భవంతిలో అగ్ని ప్రమాదం జరిగి 1400 పైగా కార్లు కాలిపోయాయి. దీనికి పక్కనే ఉన్న లివర్పూల్ ఎకో ఎరినాలో అంతర్జాతీయ గుర్రాల ప్రదర్శన జరుగుతోంది. అయితే ఈ ప్రమాదం జరగడంతో వందలా ది గుర్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రదర్శన కూడా వాయిదా వేశారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కార్లు దగ్ధం కావడంతో వాటి యజమానులకు అధికారులు అత్యవసర వసతి కల్పించారు.