
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చురుగ్గా సాగుతోంది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం జమ్మివారిపల్లె వద్ద మంగళవారం ఈ యాత్ర 700 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి, మొక్కను నాటారు. గత సంవత్సరం నవంబర్ 6న జగన్ ఇడుపులపాయ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఒక మొక్కను నాటుతూ ముందుకు సాగుతున్నారు. ఇంతవరకూ వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలను అధిగమించి చిత్తూరు జిల్లాలో యాత్ర సాగిస్తున్నారు. జగన్ కి సమస్యలు చెప్పుకునేందుకు అంటూ భారీగా జనం తరలివస్తున్నారు.