దటీజ్ వెంకయ్య .. మెరిసిన రాజ్యసభ


ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన రాజ్యసభ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఉత్పాదకతను పెంచే దిశగా ఆయన తీసుకున్న చర్యలు అతి తొందరలోనే సత్ఫలితాలను ఇచ్చాయి. సభ చరిత్రలో తొలిసారి జీరో అవర్ నివేదనలు, ప్రత్యేక ప్రస్తావనలు అన్నీ పూర్తిస్థాయిలో చర్చకు వచ్చాయి. దీనిపై సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఘనత రాజ్యసభ ఛైర్మన్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ ఈ ఘనత సభకే దక్కుతుంది అన్నారు. సభ్యుల తోడ్పాటుపైనే తన పని ఆధారపడి ఉంటుందని మొదట్లోనే చెప్పానని గుర్తు చేసారు. సభ్యుల తోడ్పాటు బాగుంది కాబట్టి తన పని సులువైందన్నారు. సభ వాయిదా పడిన వెంటనే, ప్రత్యేక ప్రస్తావనలు, జీరో అవర్ అంశాలను మంత్రులు పరిశీలించి, సభ్యులకు సమాధానాలు పంపాలని ఆయన మళ్ళీ కోరారు. దీనివలన సభ ప్రయోజనకరంగా సాగుతుందని తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం