ఆయుధ గోదాములో పేలుడు - ఆరుగురి మృతి


మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో సైన్యానికి చెందిన ఆయుధ గోదాంలో పేలుడు జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రక్షణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వార్దా జిల్లాలోని పుల్గావ్‌లో గల ఆర్మీ ఆయుధ గోదాంలో గడువుతీరిన మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేస్తున్న క్రమంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ముగ్గురు కూలీలు సహా ఆరు గురు మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగా త్రులను ఆసుపత్రికి తరలించారు. పుల్గావ్‌ ఆయుధ గోదాంలో 2016 మే నెలలో భారీ అగ్నిప్రమాదం జరిగి 16 మంది రక్షణశాఖ సిబ్బంది మరణించారు. పుల్గావ్‌ గోదాం దేశంలో సైన్యానికి చెందిన అతిపెద్ద ఆయుధ గోదాం. బాంబులు, గ్రనైడ్లు, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలతోపాటు దేశంలోని పలు ఫ్యాక్టరీల్లో తయారు చేసిన ఆయుధాలను ఇక్కడ భద్రపరచి ఇక్కడినుంచే ఫార్వర్డ్‌ బేస్‌లకు తరలిస్తుంటారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం