అమెరికాలో కాల్పులు .. ముగ్గురి మృతి


అమెరికాలోని షికాగోలో మెర్సీ ఆస్పత్రి పార్కింగ్‌ ప్రదేశంలో ఓ మహిళతో వాగ్వాదం నేపథ్యంలో ఒకడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఓ పోలీసు అధికారి సహా ముగ్గురు చనిపోయారు. దుండగుడు కూడా హతమయ్యాడు. అతడు తనంతట తాను కాల్చుకున్నాడా లేక పోలీసుల కాల్పుల్లో చనిపోయాడా అనే విషయం స్పష్టంకాలేదు. ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఓ మహిళపై తొలుత దుండగుడు కాల్పులు జరిపాడని, తర్వాత మరో మహిళను కూడా కాల్చాడని పోలీసులు వెల్లడించారు.

ముఖ్యాంశాలు