ఛత్తీస్ గఢ్ లో రెండో దశ పోలింగ్


ఛత్తీస్‌గఢ్‌లో రెండవది, చివరిదశ పోలింగ్‌ కొనసాగుతోంది. 72 నియోజ కవర్గాల్లో ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. మొత్తం లక్ష మందికిపైగా భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. శాసనసభ స్పీకర్‌, తొమ్మిది మంది మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు బూపేష్‌ భగేల్‌ తదితరుల భవితవ్యం నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. భాజపా, కాంగ్రెస్‌లు 72 నియోజకవర్గాల్లోనూ పోటీచేస్తు న్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం గల 18 నియోజకవర్గాల్లో ఈ నెల 12 తొలిదశ పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ముఖ్యాంశాలు